యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఇవాళ సందర్శించి స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందారు. ఏకాదశి రోజు చిలుకూరులో స్వామివారి దర్శనం చేయడం ఆయనకి పెద్ద భాగ్యం అని ప్రధాన అర్చకులు రంగరాజన్ వివరించారు. అలాగే వారణాసిలోని జ్ఞానవాపి దేవాలయంలో జరుగుతున్న వివాదానికి చిలుకూరు బాలాజీ స్వామి వారి పిటిషన్ కి మద్దతు తెలుపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి సందేశం ఇవ్వవలసిందిగా రంగరాజన్ అభ్యర్థించారు. ఇది ఒక దైవలీల అని ఆ స్వామి వారి ఆజ్ఞగా భావించి తప్పకుండా మద్దతు తెలుపుతామని బ్రజే ష్ పాఠక్ సానుకూలంగా స్పందించారు. అనంతరం శివాలయంలో దర్శనం చేసుకున్నారు.