Thursday, March 6, 2025
HomeసినిమాBRO: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'బ్రో'

BRO: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘బ్రో’

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీకి బ్రో అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఏ టైటిల్ పెడతారా అని అభిమానులు ఆతృతగా ఎదరు చూశారు.  బ్రో అనే టైటిల్ పెడతారని లీకైంది కానీ.. త్రివిక్రమ్ ఇంగ్లీషు టైటిల్ పెట్టరని అనుకున్నారు కానీ.. చివరకు బ్రో అనే టైటిల్  నే  ఒకే చేశారు.

బ్రో మోషన్ పోస్టర్ రికార్డులు కొల్లగొడుతోందని దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. విడుదలైన 20 గంటల 20 నిమిషాల్లో బ్రో మోషన్ పోస్టర్ 4.74 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేసిందని తెలియచేశారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో అత్యధికులు వీక్షించిన మోషన్ పోస్టర్ ఇదేనని పేర్కొన్నారు. బ్రో చిత్రంలో పవన్ భగవంతుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీని జులై 28న విడుదల చేయనున్నారు. అందుకనే ఇప్పటి నుంచి ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా పూర్తయ్యింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ను కూడా త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్