Saturday, January 18, 2025
Homeసినిమాఅందుకే.. ‘బ్రో’ లో నటించేందుకు ఒప్పుకున్నాను - కేతిక శర్మ

అందుకే.. ‘బ్రో’ లో నటించేందుకు ఒప్పుకున్నాను – కేతిక శర్మ

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి  పి. సముద్రఖని డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ తాజాగా విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

బ్రో మాతృక చూశాను. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మాతృకతో పోలిస్తే బ్రోలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. వినోదంతో పాటు వివిధ హంగులు జోడించి, మాతృక కంటే మరింత అందంగా మలిచారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది.

ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ గారు పోషిస్తున్న మార్క్ కి ప్రేయసిగా కనిపిస్తాను. ఇది సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. సినిమాలోని ప్రతి పాత్ర కథని ముందుకు నడిపించేలా ఉంటుంది. అనవసరమైన పాత్రలు గానీ, సన్నివేశాలు గానీ లేకుండా ఆసక్తికర కథాకథనాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఇదే మొదటిసారి. నా గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్నమైన చిత్రం. నటిగా మరింత మెరుగుపడటానికి సహాయపడింది.

పవన్ కళ్యాణ్ గారితో నేరుగా వెళ్లి మాట్లాడాలంటే కాస్త భయమేసింది. సాయి ధరమ్ తేజ్ గారికి చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ కలవలేకపోయాను కానీ.. ఆరోజు ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మాత్రం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆహా స్టూడియోస్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్