Monday, January 20, 2025
Homeసినిమాప్రతి అన్నాచెల్లెలు తప్పక చూడవలసిన చిత్రం బ్రో

ప్రతి అన్నాచెల్లెలు తప్పక చూడవలసిన చిత్రం బ్రో

BRO – Success Meet:
జే జే ఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై నవీన్ చంద్ర, అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీలక్ష్మీ, శ్రీనివాస్ ప్ర‌ధాన తారాగ‌ణంగా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో JJR రవిచంద్ నిర్మించిన చిత్రం బ్రో. సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అయిన‌ ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ టాక్ తో ప్రేక్షాదరణ పొందుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, టి.యఫ్.పి.సి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమక్షంలో  చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపు కున్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ “దర్శకుడు కార్తీక్ చాలా బాగా తీశాడు. ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను కానీ.. సిస్టర్ గా నటించిన అవికాతో ఫస్ట్ సీన్ కే కనెక్ట్ అయ్యాను. శేఖర్ చంద్ర అందరికీ మంచి ఫీల్ వచ్చేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర్ భ‌ట్ల‌ గారి లిరిక్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మంచి సినిమా చేశాం. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అందరికీ గుర్తుండిపోతాయి. ఇక ముందు ఇలాంటి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

నటి అవికాగోర్ మాట్లాడుతూ “ఈ క్యారెక్టర్ ను నేను ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. నవీన్ చంద్ర ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. తనతో నేను ఎంతో నేర్చుకున్నాను. దర్శకుడు చాలా చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలలో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా చూసిన వారందరికీ ఇందులో ఉన్న ఎమోషన్స్  ప్రతి ఒక్కరికీ  కనెక్ట్ అవుతాయి. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నా

Also Read : ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

RELATED ARTICLES

Most Popular

న్యూస్