Tuesday, September 24, 2024
Homeసినిమాఈ మాస్ లుక్ ఏంటి 'బ్రో'..?

ఈ మాస్ లుక్ ఏంటి ‘బ్రో’..?

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న భారీ, క్రేజీ చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఇది తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్. ఈ మూవీ మోషన్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడమే కాకుండా.. మరింతగా అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు త్వరలో బ్రో మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నామని తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ చూడగానే తమ్ముడు సినిమాలో వయ్యారి భామ నీ హంస నడక… అనే పాట గుర్తొస్తుంటుంది. అయితే.. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర పోషిస్తున్నారు. మరి.. దేవుడు ఈ గెటప్ లో.. ఇంత మాస్ గా ఉన్నాడేంటి..? అనే డౌట్ రాక మానదు. ఈ సినిమా వెనుక ఉంది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనకు పవన్ కళ్యాణ్ ను ఎలా చూపిస్తే.. బాగుంటుందో.. అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో.. బాగా తెలుసు. అందుకనే పవర్ స్టార్ ను ఇంత మాస్ లుక్ లో చూపించారు అనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రేజీ మూవీని జులై 28న విడుదల చేయనున్నారు. ఇక టీజర్ ను త్వరలో విడుదల చేస్తారు. మరి.. టీజర్ ఇంకెంత మాస్ గా ఉంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్