Thursday, March 12, 2026
Homeసినిమా 'బ్రో' మూవీని USAలో రిలీజ్ చేయనున్న 'పీపుల్ సినిమాస్'

 ‘బ్రో’ మూవీని USAలో రిలీజ్ చేయనున్న ‘పీపుల్ సినిమాస్’

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రో’.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరియు సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ను అందించారు.ఇటీవల ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.

బ్రో ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ టీజర్. “బ్రో” సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ “బ్రో” చిత్రాన్ని USA లో “పీపుల్ సినిమాస్” రిలీజ్ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular