Thursday, September 19, 2024
HomeTrending Newsతెలంగాణ గొంతుక గులాబీ జెండా - కేటిఆర్

తెలంగాణ గొంతుక గులాబీ జెండా – కేటిఆర్

ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు … ఒక్క రంగు నిత్య వసంతమై గులాబీలను గుబాలింప జేసింది … ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది …భారత రాష్ట్ర సమితి పార్టీ 23 ఉద్యమ వసంతాలను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ధుడు కేటిఆర్… తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగురవేశారు. 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు.

కేటిఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశాం. కెసిఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.

ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి… తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టిఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్ దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు.

తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశాము. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది.

మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రంలో అద్భుతమైన స్పందన లభించింది. దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేవు. అయితే కెసిఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసు.

బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం

తెలంగాణ గొంతు ఉండడం అవసరం… తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టిఆర్ఎస్… తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్