Monday, January 20, 2025
HomeTrending NewsSingareni: సింగరేణిలో బిఆర్ ఎస్ మహా ధర్నా

Singareni: సింగరేణిలో బిఆర్ ఎస్ మహా ధర్నా

సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు మందమర్రి నుంచి సత్తుపల్లి వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. రాష్ట్రంలోని అన్ని గనుల వద్ద ధర్నా నిర్వహించారు.

సింగరేణి కోసం అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని అనడానికి బీజేపీ కి, ప్రధాన మంత్రికి సిగ్గుందా? అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రల పై బి అర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు భూపాల పల్లి లో చేపట్టిన మహా ధర్నా కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ లు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పార్లమెంట్ లో అన్ని బిల్లులకు సహకరించలేదా అన్నారు. రైతులను ముంచి అదానికి అంబానీకి దోచి పెడితే, నీకు సపోర్ట్ చేయాలా అని ప్రశ్నించారు.

కొత్తగూడెం అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ మహా ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు ,సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్ , మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ , మాజీ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ఖమ్మం జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీ, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ,బచ్చు విజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి ఈ మహాధర్నా లో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్