Friday, March 7, 2025
HomeTrending Newsఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

భారత్ రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావటంతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 14 వ తేదీన ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి [బీఆర్ఎస్] జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీకి మద్దతు ఇచ్చే వారిని వివిధ రంగాలకు చెందినా ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వేదికగానే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేసి అక్కడే ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ కార్యదర్శుల నియామకం, ప్రకటన చేయనున్నారు. ఢిల్లీలో అనేకమంది రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్