Sunday, November 24, 2024
HomeTrending Newsకేంద్రం కక్షపూరిత విధానాన్ని విడనాడాలి : బీ.ఆర్.ఎస్

కేంద్రం కక్షపూరిత విధానాన్ని విడనాడాలి : బీ.ఆర్.ఎస్

రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రైతు వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని గులాబి శ్రేణులు డిమాండ్ చేశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు,DCMS ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి,వివిధ హోదాల్లో నీ ప్రజా ప్రతినిదులు, నాయకులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పట్ల కేంద్రం అవలంభిస్తున్న కక్షపూరిత విధానాన్ని విడనాడాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఆధ్వర్యంలో రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్ జయశంకర్ సర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.

త్వర‌లోనే దేశానికి బీజేపీ పీడ విరగడ అవుతుందని, సీఎం కేసీఆర్ సార‌ధ్యంలో వివిధ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం క‌క్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దీనిని జీర్ణించుకోలేక మోదీ ప్రభుత్వానికి కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇతర రాష్ట్రాల్లో చేపల ఆరబోతకు కల్లాల నిర్మాణం జరుగుతుంటే తెలంగాణలో రైతులు పంట ఆరబెట్టెందుకు నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వబోమని అనడం తెలంగాణపై వివ‌క్షకు నిదర్శనమని అన్నారు. నిర్మల్ జిల్లాలో రూ. 12 కోట్లతో 19 వేల క‌ల్లాల‌ను నిర్మించుకున్నార‌ని, ఇప్పుడు వాటికి నిధులు ఇవ్వమంటే రైతులు ఎక్కడికి పోవాల‌ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, నాయకులు అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు.

జాతీయ ఉపాధి హామీ పథకం లో రైతు కల్లాల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కే టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మేడ్చల్ పట్టణం వివేకానంద విగ్రహం దగ్గర బీ ఆర్ ఎస్ జిల్లా శాఖ ఆద్వర్యం లో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు ,గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ ,జిల్లా బీ ఆర్ ఎస్ నేతలు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్