Friday, May 2, 2025
HomeTrending Newsబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) విలీనం ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలను విలీనం చేసే ప్రతిపాదనకు 2019లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
అయితే ఎంటీఎన్‌ఎల్‌ భారీగా రుణాల ఊబిలో కూరుకుపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంది. ఎంటీఎన్‌ఎల్‌ 2016 నుంచి వరసగా ప్రతి ఏటా నష్టాలను ఎదుర్కొంటోంది. 2020-21లో ఎంటీఎన్‌ఎల్‌కు 2.454 కోట్లు, 2021-22లో 2,617 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో ఎంటీఎన్‌ఎల్‌ రుణ భారం నుంచి కుదుటపడే వరకు విలీనం ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఎంటీఎన్‌ఎల్‌ను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్