Sunday, January 19, 2025
HomeTrending Newsనిద్రావస్థలో జలవనరుల శాఖ: గోరంట్ల

నిద్రావస్థలో జలవనరుల శాఖ: గోరంట్ల

సంగం ప్రాజెక్టు రెక్కల కష్టం చంద్రబాబుది అయితే రిబ్బన్ కట్టింగ్  సిఎం జగన్ మోహన్ రెడ్డిదని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కాకపోతే పేరు మార్చారని, మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారన్నారు. 2008 లో మొదలైన సంగం ప్రాజెక్టు విషయంలో 2014 వరకూ ఎలాంటి పురోగతీ లేదని, 2015లో చంద్రబాబు మళ్ళీ దీనిపై దృష్టి సారించి పనులు మొదలు పెట్టారని, తాము అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 82.86 శాతం పూర్తయిందని గోరంట్ల వెల్లడించారు.  మిగిలిన 18 శాతం పూర్తి చేయడానికి మూడేళ్ళు పట్టిందన్నారు. మొదటి రెండేళ్లలో ఐదు శాతం మాత్రమే చేశారన్నారు. గత రెండుసార్లుగా వచ్చిన వరదల వల్ల నెల్లూరు సమీపంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగాయన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో జలవనరుల శాఖ నిద్రావస్థలో ఉందని, మూడేళ్ళుగా తగిన శ్రద్ధ లేక ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని, మరికొన్ని నత్త నడకన నడుస్తున్నాయని ఆరోపించారు. మూడేళ్ళుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా వాటిని ఒడిసి పట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాయలసీమలో కూడా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందని వాటిని తరలించే వ్యవస్థను ఏర్పాటు చేలేకపోయారన్నారు.  నిర్వహణ లేక అనేక ప్రాజెక్టులు దెబ్బతింటున్నాన్నాయని, గుండ్లకమ్మ దీనికి ఓ ఉదాహరణ అని, పులిచింతల పరిస్థితి కూడా అదేన్నన్నారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని,పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని గోరంట్ల మండిపడ్డారు.

Also Read : కేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్