Saturday, January 18, 2025
Homeసినిమాపాపం.. బుచ్చిబాబు

పాపం.. బుచ్చిబాబు

Bad Luck Bucchi Babu: ఉ ప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా. ఉప్పెన బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ముందుకు వ‌చ్చారు. భారీగా ఆఫ‌ర్స్ ఇచ్చారు కానీ.. బుచ్చిబాబు మాత్రం నెక్ట్స్ మూవీని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తోనే చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఎన్నిఆఫ‌ర్స్ వచ్చినా నో చెప్పాడు.

ఎన్టీఆర్ కి క‌థ చెప్ప‌డం.. సినిమా చేస్తాన‌ని ఎన్టీఆర్ మాట ఇవ్వ‌డంతో ఉప్పెన త‌ర్వాత నుంచి ఆ క‌థ పైనే కుస్తీ ప‌డుతూ కూర్చున్నాడు. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుచ్చిబాబుతో సినిమాని ప్ర‌క‌టిస్తార‌ని ఎదురు చూశారు కానీ.. ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ 2 డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు కానీ.. బుచ్చిబాబుతో సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు.

ఎన్టీఆర్ ప్ర‌క‌టించిన రెండు సినిమాలు పూర్త‌య్యే స‌రికి రెండు సంవత్స‌రాలు అవుతుంది. ఆత‌ర్వాత అయినా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడ‌ని గ్యారెంటీ లేదు. ఇప్ప‌టికి బుచ్చిబాబుకు జ్ఞానోద‌యం అయ్యింద‌నుకుంటా.. అందుచేత ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసి టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. నెక్ట్స్ వేరే హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. స్టార్ హీరోలు అంద‌రూ ఫుల్ బిజీగా ఉన్నారు. పాపం.. బుచ్చిబాబు ఎవ‌రితో సినిమా చేస్తాడో.

Also Read : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్