Thursday, October 3, 2024
Homeసినిమాఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ ఇంట్ర‌స్టింగ్ న్యూస్

ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ ఇంట్ర‌స్టింగ్ న్యూస్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమాని అనౌన్స్ చేశారు. అలాగే ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌నున్న మూవీని కూడా ప్ర‌క‌టించారు  కానీ.. బుచ్చిబాబుతో సినిమాని ఎన్టీఆర్ ప్ర‌క‌టించ‌లేదు.  దీంతో బుచ్చిబాబుతో సినిమా లేదేమో అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. బుచ్చిబాబుతో సినిమాని ఇటీవ‌ల ఎన్టీఆర్ ఓకే చేశార‌ని తెలిసింది.

ఇక ఈ క్రేజీ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇటీవ‌ల బుచ్చిబాబు రంగ రంగ వైభ‌వంగా మూవీ కోసం ఇంట‌ర్ వ్యూ చేశారు. ఇందులో ఎన్టీఆర్ తో చేయ‌నున్న మూవీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు. ఇంత‌కీ ఏం చెప్పాడంటే.. ఇందులో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. అందులో ఒక‌రు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ గా క‌నిపిస్తాడ‌ట‌. మ‌రొక‌రు 65 ఏళ్ల వ్య‌క్తిగా ఒక కాలు పొగొట్టుకుని వీల్ చైర్ కే ప‌రిమిత‌మైన వ్య‌క్తిగా క‌నిపిస్తార‌ట‌.

ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు, నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. మ‌రి.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్