Saturday, January 18, 2025
Homeసినిమాత్రివిక్రమ్ మూవీలో తెలంగాణ కుర్రాడిగా బన్నీ!

త్రివిక్రమ్ మూవీలో తెలంగాణ కుర్రాడిగా బన్నీ!

అల్లు అర్జున్ కెరియర్ ను ఒకసారి పరిశీలిస్తే కొత్తగా కనిపించడం కోసం .. తన పాత్ర కొత్తగా అనిపించడం కోసం ఆయన ఎంతగా తపన పడతాడనే విషయం అర్థమవుతుంది. సినిమా .. సినిమాకి వైవిధ్యం ఉండేలా ఆయన జాగ్రత్తపడుతూ ఉంటాడు. జోనర్ .. కథ .. తన పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన లుక్ కొత్తగా ఉండటం కోసం అవసరమైనంత కసరత్తు చేస్తాడు. అందుకు ఉదాహరణగా ఆయన చేసిన కొన్ని సినిమాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటి జాబితాలో ‘పుష్ప’ ఒకటిగా కనిపిస్తుంది.

‘పుష్ప’ సినిమాలో చిత్తూరు యాసలో అల్లు అర్జున్ మెప్పించాడు. ఆ కథకి .. ఆ పాత్రకి ఆ యాస అవసరం. అందువలన కొంతకాలం పాటు దానిపై కసరత్తు చేసిన ఆయన, ఆ పాత్రను ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేయగలిగాడు. ఎక్కడా కూడా కృతకంగా లేకుండా చూసుకున్నాడు. అలాగే ఇప్పుడు ఒక సినిమా మొత్తం ఆయన తెలంగాణ యాస మాట్లాడనున్నట్టుగా చెబుతున్నారు. అది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేయనున్న సినిమా. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుంది.

గతంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్ ను చాలా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా హైలైట్స్ లో ఆయన పాత్ర ఒకటిగా నిలిచింది కూడా. ఆ సినిమాలో ఆయన కొంతసేపే మెరుస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆయన సినిమా అంతటా తెలంగాణ యాసనే మాట్లాడతాడట. తెలంగాణ నేపథ్యంలో ఈ కథ నడవడమే అందుకు కారణం.  హారిక – హాసిని బ్యానర్లో 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ తరువాత ఈ సినిమా చేస్తుండటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్