Sunday, January 19, 2025
Homeసినిమాబ‌న్నీకి షాకింగ్ రెమ్యూన‌రేష‌న్?

బ‌న్నీకి షాకింగ్ రెమ్యూన‌రేష‌న్?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప‌ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. బన్నీ కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని సినిమాగా పుష్ప నిలిచింది. ఎటువంటి ప్రమోషన్ చేయకుండా హిందీ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పుష్ప మంచి విజయం సాధించడంతో రెండో భాగం పుష్ప ది రూల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది.

దీంతో మేకర్స్ అందరి అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు. అందుకోసం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. రెమ్యూనరేషన్ రూపంలోను బన్నీకి భారీగా చెల్లిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 చిత్రాన్ని 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌‌ రెమ్యూనరేషన్ రూపంలో రూ. 125 కోట్లను తీసుకుంటున్నాడట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్….ఈ చిత్రంలో సాయిపల్లవి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. గిరిజన యువతిగా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించ‌నున్నారు. మ‌రి.. పుష్ప 2 తో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.

Also Read : మేకోవ‌ర్ తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్