Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప తరువాత బ‌న్నీ మూవీ డైరెక్ట‌ర్ ఫిక్స్?

పుష్ప తరువాత బ‌న్నీ మూవీ డైరెక్ట‌ర్ ఫిక్స్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేశారో తెలిసిందే. దీంతో పుష్ప 2 మూవీ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని సినీ జ‌నాలు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ లో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. వ‌చ్చే సంవ‌త్స‌రంలో లేదా 2024లో పుష్ప 2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. పుష్ప 2 త‌ర్వాత అల్లు అర్జున్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

మురుగుదాస్, బోయ‌పాటి, అట్లీ.. ఇలా కొంత మంది ద‌ర్శ‌కుల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి కానీ.. ఎవ‌రితో అనేది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. పుష్ప 2 స్టార్ట్ అయిన త‌ర్వాతే క్లారిటీ వ‌స్తుంద‌ని ఆమ‌ధ్య బ‌న్నీ వాసు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బ‌న్నీతో ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ మూవీ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే… కొర‌టాల శివ‌. ఎన్టీఆర్ తో కొర‌టాల భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

అయితే… ఎన్టీఆర్ తో మూవీ త‌ర్వాత కొర‌టాల బ‌న్నీతో సినిమా చేయ‌నున్నార‌ని తెలిసింది. వీరిద్ద‌రూ క‌లిసి ఎప్పుడో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్ కాలేదు. ఇప్పుడు కొర‌టాల‌తో మూవీ చేయ‌డానికి బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. 2023 ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమాని ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే.. బ‌న్నీని కొర‌టాల ఎలా చూపిస్తారో..?  చూడాలి మ‌రి.

Also Read : అల్లు అర్జున్, అట్లీ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్