Sunday, January 19, 2025
Homeసినిమాఐకాన్ స్టార్ ఏం చెబుతారో?

ఐకాన్ స్టార్ ఏం చెబుతారో?

Bollywood Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. దీంతో అయన ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ క్రేజ్ వ‌ల‌నే అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ బ‌డా ఫిల్మ్ మేక‌ర్స్ క్యూక‌డుతున్నారు. త‌న‌కు వ‌చ్చిన క్రేజ్ కు త‌గ్గ‌ట్టుగా వ‌రుస‌గా పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ లైనప్ లో ఒక‌దానిని మించి మ‌రొక‌టి బిగ్ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే బ‌న్నీ బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేయనున్నాడని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దానికి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో అల్లు అర్జున్ భారీ అనౌన్స్ మెంట్ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఏప్రిల్ లో అల్లు అర్జున్ ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వ‌నున్నారు?  ఎవ‌రితో సినిమాను ప్ర‌క‌టించ‌నున్నారు?  అనేది అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను ఆస‌క్తిగా మారింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. ఆ రోజునే ఈ అనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. అల్లు అర్జున్ అనౌన్స్ చేసే ఆ బిగ్ అనౌన్స్ మెంట్ ఏంటో తెలియాలంటే.. ఏప్రిల్ 8 వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read : సుకుమార్ కు వీరాభిమాని సర్ ప్రైజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్