Wednesday, March 26, 2025
HomeTrending NewsFire Accident: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం.. ఒకరి మృతి

Fire Accident: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం.. ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా పరిధిలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే బస్సు దిగడంతో వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్కూటీ పై ప్రయాణిస్తున్న మురుగేష్ రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్