Sunday, January 19, 2025
HomeTrending Newsనాసిక్ లో బస్సు ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

నాసిక్ లో బస్సు ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో నాసిక్​-ఔరంగాబాద్​ రహదారిపై హోటల్​ చిల్లీ చౌక్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

మంటల్లో చిక్కుకుని 14 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాసిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్