Tuesday, June 9, 2026
HomeTrending Newsమధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్‌ జిల్లా ఖాల్‌ఘాట్‌ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడింది. బస్సు ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారు., ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా.. 15 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular