Sunday, September 8, 2024
Homeసినిమా'బుట్టబొమ్మ' అక్కడే ఇబ్బంది పడింది!

‘బుట్టబొమ్మ’ అక్కడే ఇబ్బంది పడింది!

ఒకప్పుడు సినిమాల పరిస్థితి వేరు .. ఇప్పటి పరిస్థితి వేరు. గతంలో ఎవరు ఏ భాష నుంచి కథను పట్టుకొచ్చి ఇక్కడ రీమేక్ చేస్తున్నది ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుల్లో ఫస్టు పోస్టర్ రిలీజ్ కాగానే, అది ఫలానా పోస్టర్ కి కాపీ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందువలన ఒక కథను తెరపై చెప్పేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్తదనం కనిపించకపోతే ఆడియన్స్ వెంటనే దానిని పక్కన పెట్టేస్తున్నారు.

నిన్ననే ‘బుట్టబొమ్మ’ సినిమా థియేటర్లకు వచ్చింది. అనిఖ సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలామందికి తెలుసు. ఆమె హీరోయిన్ గా తెలుగు చేసిన మొదటి సినిమా కావడంతో అంతా ఆసక్తిని కనబరిచారు. ఒక పల్లెటూరి అమ్మాయి, ఫోన్ కాల్ ద్వారా పరిచయమైన వ్యక్తి మాటలను నమ్మి .. అతని పట్ల ప్రేమను పెంచుకుని ఊరు దాటితే ఏం జరుగుతుందనే కథ. ఈ కథకి కేంద్ర బిందువు అనిఖ పాత్ర కావడం ప్లస్ పాయింట్ అయితే, ఆమె పాత్రను మాత్రమే పట్టించుకుని మిగతా పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం మైనస్.

ఈ కథలో అనిఖ చాలా బుద్ధిమంతురాలు .. కృష్ణుడి దగ్గర ప్రతిరోజు దీపం పెడుతుంది .. తాను కష్టపడి ఫోన్ కొనుక్కోవడం కోసం దాచుకున్న డబ్బును చెల్లెలు సైకిల్ కొనుక్కోవడానికి ఇచ్చేస్తుంది. అలాంటి అమ్మాయి ముక్కూ మొహం తెలియని ఒక ఆటో డ్రైవర్ కోసం ఇల్లొదిలి వెళ్లడం వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను ముగ్గులోకి దింపిన సూర్య  .. ఆమెను ఇష్టపడే చిన్నీ పాత్రను పోషించిన వ్యక్తి ఏజ్ ఆమె కంటే చాలా ఎక్కువ. ఇద్దరికీ యాక్టింగ్ రాలేదు.

ఇక ఈ ఇద్దరు హీరోలు కానీ హీరోలను పక్కకి తప్పిస్తూ అర్జున్ దాస్ ఎంట్రీ ఇచ్చిన తరువాత కథ కాస్త ఫరవాలేదు అనిపిస్తుంది. ఆయన పాత్రను హైలైట్ చేయవచ్చు .. కానీ ఈ కథను ఇంతకంటే ఎక్కువ చెప్పలేం అన్నట్టుగా 2 గంటల్లో అవ్వగొట్టేశారు. ‘బుట్టబొమ్మ’ టైటిల్ .. విలేజ్ నేపథ్యం అనగానే అందరూ కూడా ఇది టీనేజ్ లవ్ స్టోరీ అనుకుంటారు. హీరోయిన్ మాత్రమే టీనేజ్ లో కనిపిస్తుంది గానీ అక్కడ లవ్ స్టోరీ లేకపోవడమే ఆడియన్స్ ను నిరాశ పరిచింది. ఈ లోపాల కారణంగానే సంగీతం .. ఫొటోగ్రఫీ కూడా ‘బుట్టబొమ్మ’ కాపాడలేక పోయాయని చెప్పుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్