తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు విరివిగా పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 6 నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ దిశలో తుఫాన్ ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు.
తుఫాన్ 8 నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీని ప్రభావం ఒడిశా, ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నదని అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ అంచనా వేశాయి. తుఫాన్ ఏర్పడితే దానికి ‘మోచా’గా పేరు పెట్టనున్నారు.