Saturday, January 18, 2025
HomeTrending Newsభ్రమల్లో బతుకుతున్నారు: బైరెడ్డి ధ్వజం

భ్రమల్లో బతుకుతున్నారు: బైరెడ్డి ధ్వజం

సిఎం జగన్, మంత్రి రోజా, వైసీపీ నేతలపై విమర్శలు చేసే ముందు లోకేష్ తన స్థాయి తెలుసుకోవాలని శాప్ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హితవు పలికారు. ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి సిఎం జగన్ అని, అలాంటి నేతపై ఇష్టానుసారం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిచుకుని, వేలాది మందికి రాజకీయ జీవితం ఇచ్చిన సిఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంపట్ల  బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  లోకేష్ వ్యాఖ్యలు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయని, మంగళగిరిలో గెలవలేని ఓ పనికిమాలిన వ్యక్తి విమర్శలు చేయడం దారుణమని తీవ్రంగా స్పందించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు  భ్రమల్లో బతుకుతున్నారని, వారు నిరుపేదల వద్దకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో అడిగి తెలుసుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బైరెడ్డి మాట్లాడారు.   లోకేష్, బాబు యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపికి 2,3  స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదని,  ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా  జై జగన్ అని నినదిస్తున్నారని,  ఏపీలో ఇల్లు కట్టుకొని ఉండాలని వారిని నిలదీస్తున్నారని చెప్పారు.  తెలుగుదేశం పార్టీ నేతలు  భ్రమల్లో బతుకుతున్నారని, వారు నిరుపేదల వద్దకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో అడిగి తెలుసుకుకోవాలన్నారు.

వైఎస్ తమను ఏమీ చేయలేకపోయారని లోకేష్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో వైఎస్ చేసిన మేలు ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు.  చంద్రబాబు చేకట్లో  సోనియా కాళ్ళు పట్టుకొని జగన్ పై కేసులు పెట్టించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బలమైన పునాదుల మీద సామ్రాజ్యాన్ని నిర్మించాలేకానీ, అలాంటి పునాదుల మీద పేకమేడ నిర్మించకూడదని వ్యాఖ్య్యానించారు.  రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెల్లడంకాదని, 75ఏళ్ళ స్వాతంత్ర్య చరిత్రలో ప్రజల వద్దకు పాలన చేరిందని, విద్యా, వైద్యంలో సంస్కరణలు తెచ్చామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకూ రైతుకు అండగా ఉన్నామని వివరించారు.

సిమెంట్ కంపెనీతో ఒప్పందాలు చేసుకొని 250 కోట్ల రూపాయలు మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా అని బైరెడ్డి ప్రశ్నించారు. సిఎం జగన్ ను జాదూ రెడ్డి అని అంటున్నారని, కానీ సిమెంట్ కంపెనీల డబ్బును మాయం చేసిన లోకేష్ తండ్రే జాదూ బాబు అని విమర్శించారు.  గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై తాము విచారణ చేస్తుంటే ప్రతి కేసులోనూ కోర్టులకెళ్ళి స్టే లు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని భూములు, అచ్చెన్నాయుడు, దూలిపాళ్ల నరేంద్ర, లక్ష్మీ పార్వతి వేసిన అక్రమాస్తుల కేసు…. ఇలా ఎన్నో కేసుల్లో స్టే లు తెచ్చుకున్నారన్నారు.  ఏలేరు కుంభకోణంలో బాబు దోచుకున్న మాట వాస్తవం కాదా? విచారణ తోక్కిపెట్టిన మాట నిజం కాదా… ఇప్పుడు అవినీతి మీద బాబు మాట్లాడడం సిగ్గుచేటని సిద్దార్థ్ రెడ్డి అన్నారు.

Also Read : మూడు రాజధనులతోనే అభివృద్ధి – బైరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్