Saturday, September 21, 2024
HomeTrending Newsకరోనా కేసుల ఉధృతి 

కరోనా కేసుల ఉధృతి 

దేశంలో కరోనా కేసులు తామర తంపరగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.64.202 వెలుగు చూశాయి. పాజిటివిటి రేటు 14.78 గా ఉంది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ వ్యాప్తి 6.7 శాతం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 46,406 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 28,867 కేసులు, కర్నాటకలో 25,005 కేసులు, తమిళనాడులో 20,911 కేసులు,  పశ్చిమ బెంగాల్ లో 23,467 కేసులు ఉత్తరప్రదేశ్ లో 14,765 కేసులు కేరళలో 13,468 కేసులు ఉన్నాయి.

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశంలో ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా నియంత్రణపై అందరూ దృష్టి పెట్టాలి. పండుగ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. దేశంలో రెండో డోసు 70 శాతం పూర్తయ్యింది. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినే అతిపెద్ద  ఆయుధం అన్నారు. దేశంలో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ పూర్తి. ఈ విపత్తుతో ప్రజలు జీవనోపాధి కోల్పోకూడదు. రాష్ట్రాల వద్ద సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషన్‌ డోసులు అందిస్తున్నాం. అవసరమైన వారికి టెలిమెడిసన్‌ ద్వారా సేవలు అందేలా చూడాలి’ అని మోదీ తెలిపారు.ప్రధానంగా దేశంలో.. కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల పెరుగుదల కలకలంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్