Saturday, November 23, 2024
Homeసినిమా'బ్రో' అంచనాలను అందుకునేనా? 

‘బ్రో’ అంచనాలను అందుకునేనా? 

పవన్ ఒక వైపున రాజకీయాలలో బిజీగా ఉండటం వలన సినిమాల పరంగా పెద్ద ప్రాజెక్టులను ఒప్పుకోవడానికి పెద్ద ఆసక్తిని చూపడం లేదు. ఎక్కువగా చిన్న ప్రాజెక్టులను ఒప్పుకుంటూ, చాలా ఫాస్టుగా వాటి షూటింగ్స్ ను పూర్తిచేస్తున్నారు. చిన్న సినిమాలు చేయాలంటే కంటెంట్ లో ఉన్న బలం ఎంతో తెలియదు. అది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకూడదు. అందువల్లనే ఆయన రీమేకుల పట్ల ఉత్సాహాన్ని చూపుతూ వెళుతున్నారు.

అలా వచ్చిన సినిమాలే ‘వకీల్ సాబ్’ .. ‘భీమ్లా నాయక్’. ఈ నెల 28వ తేదీన థియేటర్స్ కి రానున్న ‘బ్రో’ కూడా ఈ తరహాలో చేసినదే. పవన్ కి గల క్రేజ్ పరంగా చూసుకుంటే, చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను చేశారు .. చాలా తక్కువ రోజులలో చేశారు కూడా. తమిళంలో 2021లో వచ్చిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. సముద్రఖని .. తంబి రామయ్య ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా కూడా ప్రశంసలు అందుకుంది. భారీ వసూళ్లను కూడా సాధించింది.

అక్కడ కథాబలంతో ఆడిన ఈ కథకి ఇక్కడ స్టార్స్ తోడయ్యారు. తమిళంలో ఆ సినిమాను తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకి కూడా దర్శకుడు. అయితే పవన్ బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసిన త్రివిక్రమ్ రంగంలోకి దిగారు. స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించారు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో మోడ్రన్ గా కనిపించే దేవుడి పాత్రలో మెప్పించిన పవన్, ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించనున్నారు. రీసెంటుగా వదిలిన ట్రైలర్ తో అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్