Sunday, April 6, 2025
Homeస్పోర్ట్స్US Open-2022: అల్కరాజ్  విజేత

US Open-2022: అల్కరాజ్  విజేత

స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ -2022  పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్లో నార్వే ఆటగాడు కాస్పెర్ రూడ్ పై 6-4; 2-6; 7-6; 6-3 తేడాతో విజయం సాధించి తన కెరీర్ లో తొలి గ్రాండ్స్ స్లామ్ టైటిల్ అందుకున్నాడు.  ఈ విజయంతో పాటు 19 ఏళ్ళ వయసులోనే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచి ఈ ఘనత సాధించిన వారిలో అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

అల్కరాజ్ తన కెరీర్ లో ఇప్పటివరకూ ఆరు ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ తో పాటు రెండు ‘మాస్టర్ 1000’టైటిల్స్ కూడా గెల్చుకున్నాడు.

ఈ ఏడాది జరిగిన గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఆస్ట్రేలియా ఓపెన్ లో మూడవ రౌండ్ లో ఓటమి చెందిన అల్కరాజ్… ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరుకున్నాడు. వింబుల్డన్ లో నాలుగో రౌండ్ లో ఓటమి పాలయ్యాడు. అయితే చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ లో సత్తా చాటి విజేతగా నిలిచాడు.

Also Read : US Open-2022: మహిళల సింగిల్స్ విజేత స్వియటెక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్