గత వారం అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాల పరిధిలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టులపై యుద్ధ భేరీ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టులో జరిగే రోడ్ షో కు చంద్రబాబు వెళుతున్న సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగళ్లులో జరిగిన ఘటనల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది..
ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇతరులంటూ మరికొందరు తెదేపా నేతలపైనా కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.