Sunday, January 19, 2025
HomeసినిమాDimple Hayathi: హీరోయిన్ డింపుల్ హాయతిపై క్రిమినల్ కేసు

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హాయతిపై క్రిమినల్ కేసు

పార్కింగ్ చేసిఉన్న పోలీసు  అధికారి వాహనాన్ని ఢీ కొట్టిన వ్యవహారంలో హీరోయిన్  డింపుల్ హయతి, ఆమె కాబోయే భర్త డేవిడ్ పై జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి రాహుల్  హెగ్డే,  నటి డింపుల్ ఓకే అపార్ట్మెంట్ లో వేర్వేరు ఫ్లాట్లలో నివసిస్తున్నారు.

రాహూల్ కారుకు డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో కారును పార్కింగ్ చేస్తున్నారు. దీని పక్కనే  డింపుల్ హాయితి తమ వాహనం  పార్క్   చేస్తుంటారు. డిసిపి వాహనాన్ని అక్కడినుంచి తీసేయాలని ప్రతిరోజు హయతి, డేవిడ్ లు గొడవ చేసేవారు. అప్పుడపుడూ కాలితో  తన్నడం కూడా చేస్తుండేవారు. అధికారి రాహుల్ పలుసార్లు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 14న డింపుల్  ఏకంగా తన వాహనంతో   డిసిపి వాహనాన్ని ఢీ కొట్టింది.  డ్రైవర్ చేతన్ ఈ విషయాన్ని  సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుని  జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్