ఆదిభట్ల విజయనగరం దగ్గర అజ్జాడ గ్రామంలో పుట్టారు. గౌరవవాచకం శ్రీమత్; ఊరిపేరు అజ్జాడ కలిపి శ్రీమదజ్జాడ; ఇంటిపేరు ఆదిభట్ల- మొత్తం "శ్రీమదజ్జాడ ఆదిభట్ల" అయ్యింది. తెలుగు హరికథను ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించినవాడు...
ఎప్పుడన్నా చుట్టాలింటికి వెళ్తే బాగానే ఉంటుంది. అక్కడ ఎంత బాగున్నా పని అయిపోగానే ఇంటికి వచ్చేయాలని ఉంటుంది. కరోనా టైం లో చాలామంది బంధువుల ఇళ్ళకి వెళ్లి చిక్కుకు పోయారని విన్నాం. వారిని...
మాదక ద్రవ్యాలు, మద్యపానీయాలు యుగయుగాలుగా ఉన్నాయి. త్రేతాయుగంలో నేలకు అనకుండా గాల్లో తేలుతూ ఉండే రావణాసురుడి పుష్పక విమాన సువిశాల సౌధం బార్ కౌంటర్లో ఎన్ని రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉండేవో...
చైనా, రష్యాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. యువకులు పెళ్లికి దూరం కావడంతో జననాల రేటు తగ్గుతోంది. ముసలివారి నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో...
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకచోట చేరినవారందరూ సైన్యంలో వైమానికదళంలో పనిచేశారు. ఇరవైఏళ్లపాటు సైనికులుగా పనిచేసి...అటు తరువాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాంటి వందమంది మాజీ సైనికుల రీ-యూనియన్ ముచ్చట్లు ఇవి. ఆ...
ఎల్. బి. శ్రీరామ్ గారికి,
నమస్సులు. మీరు నిర్మించి, నటించిన "కవిసమ్రాట్ విశ్వనాథ"ను యూట్యూబ్ లో చూశాక స్పందనగా ఈ నాలుగు మాటలు.
"అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార...
పత్రికలు తిరగేస్తుంటే చిత్ర విచిత్రమైన ప్రకటనలు కనపడుతుంటాయి. అందులో భాష, భావం తెలుగే అయినా...తెలుగువారికి అర్థం కాకుండా రాస్తుంటారు కాబట్టి...తొంభై తొమ్మిది శాతం ప్రకటలను ఎవరూ చదవరు కాబట్టి...బతికిపోతుంటారు. చదివే ఒక శాతం...
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత. రాజ కుమార్తె తలచుకుంటే దేనికి కొదవ అని కొత్త సామెత చెప్పే సంఘటన ట్రెండింగ్ అవుతోంది.
షీకా మహరా దుబాయ్ రాజు కూతురు. ఆయనకున్న...
ఓ సెల్లు ఫోనా! సదా తోడు నీడా!
ఓ కర్ణ పిశాచీ! సదా దృశ్యరూపీ!
ఓ టవరు బంధూ! సదా సిగ్నలుండు!
ప్రభాతంబు సాయంత్రంబు నీ ధ్యాసలో ఉండి...నీ లీల వర్ణించి...నీమీద నే దండకంబొక్కటిన్ జేయ నూహించి...
నీ...
సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...