Saturday, January 18, 2025
Homeసినిమాకేథరిన్ కేర్ తీసుకోకపోతే కష్టమే!

కేథరిన్ కేర్ తీసుకోకపోతే కష్టమే!

వెండితెరకి పరిచయమైన అందాల భామలలో కేథరిన్ ఒకరు. నేరేడుపండ్లలాంటి కళ్లు కేథరిన్ కి ప్రత్యేకమైన ఆకర్షణ. ఆ కళ్లు చేసే గడుసు గారడీ చూడటానికి కుర్రాళ్లు ఇష్టపడతారు. మలయాళ … కన్నడ ప్రేక్షకులను పలకరించిన తరువాతనే ఆమె తెలుగు తెర దిశగా అడుగులు వేసింది. నటన విషయాన్ని పక్కన పెడితే గ్లామర్ పరంగా ఆమెకి తక్కువ మార్కులు పడింది ఎప్పుడూ లేదు. తెలుగులో చేసిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలతో’ .. ‘సరైనోడు’ .. ‘ నేనేరాజు నేనే మంత్రి’ సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకుని వచ్చాయి.

మొదటి నుంచి కూడా కేథరిన్ రెండవ కథానాయిక పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చింది.  సింగిల్ హీరోయిన్ గా కనిపించే అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమెకి అదృష్టం కలిసి రాలేదు. అలాంటి సినిమాలు పరాజయం పాలవుతూ వచ్చాయి. ఇక ఒకానొక సమయంలో కేథరిన్ కోలీవుడ్ పైనే  పూర్తి దృష్టి పెట్టేసి .. అక్కడే వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. ఆ సినిమాల ఫలితాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, కోవిడ్ తరువాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ వెళుతోంది. ‘భళా తందనాన’ సినిమాలో సింగిల్ హీరోయిన్ గా సందడి చేసిన ఆమె, స్పీడ్ పెంచినట్టే కనిపిస్తోంది.

కేథరిన్ తాజా చిత్రంగా ఈ నెల 5వ తేదీన ‘బింబిసార’ థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో ఆమె సంయుక్త మీనన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ నెల 12వ తేదీన ‘మాచర్ల నియోజక వర్గం’లో కృతి శెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో రవితేజ సరసన కనిపించనుంది. కేథరిన్ కి ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ  ఈ మధ్య కాలంలో ఆమె బాగా బరువు పెరిగిపోయింది. మునుపటి గ్లామర్ ఆమెలో ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆమె ఈ విషయంలో కేర్ తీసుకోకపోతే రెండవ కథానాయిగా కనిపించే అవకాశాలు చేజారడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్