జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. ఐదు దశలో ఇప్పటివరకు ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో నిర్వచన్ సదన్ నుండి రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఐదు దశలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డి ఈ ఓ మరియు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ అధికారులు వారి వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓ లు పి కోటేశ్వరరావు, ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.