Saturday, January 18, 2025
HomeTrending Newsవిదేశీ టీకాలకు ఓకే : నీతి ఆయోగ్

విదేశీ టీకాలకు ఓకే : నీతి ఆయోగ్

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి పొందిన ఏ టీకానైనా మన దేశంలో దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని నీతి ఆయోగ్ (వైద్యం) సభ్యుదు డా. వి.కే. పాల్ తెలిపారు. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవన్నారు.

రష్యా నుంచి స్పుత్నిక్ వి వాక్సిన్ వచ్చిందని, వచ్చేవారం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని పాల్ వివరించారు, జూలై నుంచి భారత్ లోనే స్పుత్నిక్ వాక్సిన్ తయారికీ సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు విదేశాంగ శాఖను సంప్రదించాయని, భారత్‌లో టీకా ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్‌ జాన్సన్ సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఆగస్టు-డిసెంబర్‌ మధ్య భారత్‌లో 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం వివరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్