Friday, March 29, 2024
Homeజాతీయంఫార్ములా బదిలీకి భారత్ బయోటెక్ నిర్ణయం

ఫార్ములా బదిలీకి భారత్ బయోటెక్ నిర్ణయం

వాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోవాగ్జిన్ వాక్సిన్ ఫార్ములా ను మరికొన్ని కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఫార్ములాను వేరే కంపెనీలకు ఇచ్చేందుకు కోవాగ్జిన్ ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ కూడా అంగీకరించింది.

కోవాగ్జిన్ ఫార్ములా బదిలీ చేయాలని చాలామంది కోరుతున్నారని,  భారత్ బయోటెక్ కూడా దీన్ని స్వాగతించిందని నీతి ఆయోగ్ (వైద్యం)  సభ్యుదు డా. వి.కే. పాల్ తెలిపారు.

వాక్సిన్ల ఉత్పత్తికి బి ఎస్ ఎల్ -౩ ల్యాబ్ లు వుండాలని కేంద్రం నిర్దేశించింది. వాక్సిన్ ఫార్మూలను మరికొన్ని కంపెనీలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కేంద్రాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్