Sunday, February 23, 2025
HomeTrending Newsడాలర్ పై రష్యా ఆంక్షలు

డాలర్ పై రష్యా ఆంక్షలు

ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో ఉత్తర కొరియా, ఇరాన్‌ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలులో ఉన్నాయి. మరోవైపు బహుళ జాతి సంస్థలు యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించాయి. ఈ జాబితాలో ఇప్పుడు మెక్ డోనాల్డ్ కంపనీ కూడా చేరింది. అంతర్జాతీయ సంస్థలు, బ్రాండ్‌లు ఇప్పుడు రష్యాలో కనిపించడంలేదు. అనేక షాపింగ్ మాల్స్, బ్రాండ్ స్టోర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా మారబోతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశీ కరెన్సీ విత్ డ్రా కు సెంట్రల్ బ్యాంకు అఫ్ రష్యా పరిమితులు విధించింది. పది వేల అమెరికా డాలర్ల కన్నా ఎక్కువగా సొమ్ము చేసుకునే అవకాశం లేదని, అంతకన్నా ఎక్కువగా డబ్బులు అవసరం అయితే రష్యా కరెన్సీ రూబుల్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేది వరకు ఈ ఆంక్షలు ఉంటాయని సెంట్రల్ బ్యాంకు అఫ్ రష్యా వెల్లడించింది.

మరోవైపు, ఉక్రెయిన్‌తో ఓవైపు చర్చలు.. మరోవైపు యుద్ధం కొనసాగిస్తూనే ఉంది రష్యా.. నిన్న జరిగిన మూడో దఫా చర్చలు కూడా విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద్మిర్ జేలేన్సకీ ఈ రోజు ప్రకటించారు. దీంతో చర్చలు సఫలమవుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో నాల్గో విడుత చర్చలు జరగబోతున్నాయి. తాజాగా పౌరుల తరలింపు కోసం రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది .

Also Read : రూపాయిపై యుద్ధం పిడుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్