Saturday, January 18, 2025
HomeTrending Newsఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను నెలరోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 92 సెక్షన్ ప్రకారం తాము ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది.  ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖా డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ఓ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్యా సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా తగిన స్పందన లేకపోవడంతో తాము ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

విభజన తర్వాత 2014-17 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను ఏపీకి చెల్లించాల్సిన అసలు 3,441 కోట్ల రూపాయలు కాగా, లేట్ పేమెంట్ సర్ ఛార్జీల కింద మరో 3,315 కోట్ల రూపాయలు బకాయి పడింది. వీటిని చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు తెలంగాణా రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. సిఎం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ దీనిపై ప్రధాని తో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పిస్తూ వచ్చారు. ఒకేసారి మొత్తం 6,766కోట్ల రూపాయలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్