Sunday, February 23, 2025
HomeTrending Newsఏడాదిన్నర లోగా పది లక్షల ఉద్యోగాల భర్తీ

ఏడాదిన్నర లోగా పది లక్షల ఉద్యోగాల భర్తీ

Central Govt Jobs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో 10 లక్షల మంది ఉద్యోగుల నియామకానికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖలు, విభాగాల పరిధిలో మానవ వనరుల పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు.

‘‘అన్ని శాఖల పరిధిలో ఉద్యోగ ఖాళీలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్ లో వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్షాలు తరచూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రధాని నుంచి ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీల అంశాన్ని వివిధ పార్టీలు తరచూ ప్రస్తావిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్