Thursday, April 25, 2024
HomeTrending Newsఈ తరం చాయ్ వాలీ!

ఈ తరం చాయ్ వాలీ!

Chai waali: ఆ మధ్య కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా అనే సినిమా వచ్చింది. టీ ప్రధానాంశంగా వ్యాపారంలో విజయం సాధించడం ఇతివృత్తం. సినిమా విజయం సాధించకపోయినా టీ గురించి ఇంత సినిమా తీసారేంటబ్బా అనిపించింది. ఉద్యోగాలకోసం పరుగెత్తకుండా ఇలా సొంతంగా టీ వ్యాపారం పెట్టుకుంటే మేలే అని ఆలోచించినవారూ ఉన్నారు. ఆపైన ప్రధాని స్థాయి కాకున్నా ఎంతో కొంత రాజకీయాల్లోనూ రాణించవచ్చని కూడా జోకులేశారు. అయితే చదువుకుని నిరుద్యోగిగా మిగిలిపోవడం కన్నా టీ వ్యాపారం మేలని నిరూపిస్తోంది ఒక అమ్మాయి.
ప్రియాంక గుప్తాది బీహార్. 2019 లో డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం చాలా పరీక్షలు రాసింది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగం సాధించాలన్న కోరిక నెరవేరలేదు. ఇంకా ఎంతకాలం ఇలా అనే ప్రశ్న ఉదయించింది. ప్రధాని ఆత్మ నిర్భర్ నినాదం అందుకుంది. టీ వ్యాపారం తో ప్రగతి సాధించిన ప్రఫుల్ బిల్లోరె (ఎంబీఏ చాయ్ వాలా)గురించి తెలుసుకుంది. చాయ్ వాలీ ఎందుకు ఉండకూడదంటూ పాట్నా లో ఉమెన్స్ కాలేజీ ముందు టీ దుకాణం ప్రారంభించింది. రకరకాల టీ, కుకీస్ అమ్ముతూ ఆదరణ సాధిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయి, అనేకులు ప్రియాంకను అభినందించారు. ఈ మాత్రం దానికి చదువుకోవడం అవసరమా అన్నవారు, ఇది ప్రభుత్వ వైఫల్యమే అనేవారు …. మంచిదే చాయ్ వాలీ లు పెరగాలి. చాయ్ పే చర్చా జరగాలి. ఆల్ ద బెస్ట్ ప్రియాంకా!

Also read : త్రిలోక సీతారాం రచనలు – వెలుగు రేఖలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్