Saturday, January 18, 2025
Homeసినిమాచైతూ - చందూ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

చైతూ – చందూ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తుననారు. ఇది మత్స్యకారుల జీవితంలో జరిగిన యధార్థ సంఘటనలు ఆధారంగా రాసుకున్న కథ. ఈ కథ కోసం మరింతగా తెసుకునేందుకు ఇటీవల శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాసు వెళ్లి కలిశారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమాకి సంంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.

మరి.. ఎప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు అంటే.. అక్టోబర్ 20 నుంచి అని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి అంతా సెట్ అయ్యింది కానీ.. హీరోయిన్ ఎవరూ అనేది మాత్రం ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. కీర్తి సురేష్, సాయిపల్లవి..ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవితో ఆల్రెడీ లవ్ స్టోరీ మూవీలో నటించాడు కాబట్టి.. కీర్తి సురేష్‌ అయితే.. ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది అనేది మేకర్స్ ప్లాన్.

త్వరలోనే ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ చేయనున్నారు. భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. చైతన్య మార్కెట్ కు మంచి బడ్జెట్ పెడుతున్నారట. ఈ పాన్ ఇండియా మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. మరి.. కస్టడీ మూవీతో నిరాశపరిచిన చైతన్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్