Tuesday, September 17, 2024
Homeసినిమా చైతు, ప‌ర‌శురామ్ మూవీకి ఆ.. టైటిలే ఫిక్స్ చేశారా.?

 చైతు, ప‌ర‌శురామ్ మూవీకి ఆ.. టైటిలే ఫిక్స్ చేశారా.?

Title Grandpa: అక్కినేని నాగ‌చైత‌న్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తోన్న నాగ‌చైత‌న్య ఇప్పుడు థ్యాంక్యూ అంటూ మ‌రో స‌క్సెస్ సాధించేందుకు రెడీ అయ్యాడు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన థ్యాంక్యూ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన థ్యాంక్యూ మూవీ జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. స‌ర్కారు వారి పాట సినిమాతో స‌క్సెస్ సాధించిన ప‌ర‌శురామ్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్ర‌క‌టించారు కానీ.. ప‌ర‌శురామ్ మ‌హేష్ తో సినిమా చేయ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అయ్యింది. ఇప్పుడు చైత‌న్య‌, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ చిత్రానికి నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ టైటిల్ నే ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చైత‌న్య చిత్రానికి తాత పేరు టైటిల్ గా పెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో అస‌లు ఈ సినిమా క‌థ ఏంటి..?  చైత‌న్య క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. ఈ సినిమాతో కూడా చైత‌న్య‌ మ‌రో స‌క్సెస్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

Also Read : నాగ‌చైత‌న్య‌కు హీరోయిన్ ఎవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్