Tuesday, February 25, 2025
HomeTrending NewsRains: నాలుగురోజులపాటు వర్షాలు

Rains: నాలుగురోజులపాటు వర్షాలు

తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం రాత్రి నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్‌ 30, మే 1వ తేదీల్లో చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్