Friday, July 5, 2024
HomeTrending Newsడిప్యూటీ సిఎంగా పవన్, హోం మంత్రిగా అనిత

డిప్యూటీ సిఎంగా పవన్, హోం మంత్రిగా అనిత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సిఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  శాఖలు కేటాయించారు. గత జగన్ ప్రభుత్వంలో మహిళలు నిర్వహించిన హోం శాఖను చంద్రబాబు కూడా మహిళా మంత్రి వంగలపూడి అనితకు అప్పగించారు. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటి, కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖలు ఇచ్చారు.

మంత్రులు – శాఖలు…

  1. నారా చంద్రబాబునాయుడు – సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు,
    ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు
  2. పవన్ కళ్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా
    అటవీ, పర్యావరణం, సైన్సు అండ్ టెక్నాలజీ
  3. నారా లోకేష్ –  మానవ వనరుల అభివృద్ధి, ఐటి, కమ్యూనికేషన్స్,
    రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ)
  4. కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక,
    మత్స్య, డెయిరీ డెవలప్మెంట్
  5. కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ; ఎక్సైజ్
  6. నాదెండ్ల మనోహర్ – పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
  7. పొంగూరు నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్
  8. వంగలపూడి అనిత – హోం, విపత్తు నిర్వహణ
  9. సత్య కుమార్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; వైద్య విద్య
  10. నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి
  11. ఎన్.ఎం.డి. ఫరూఖ్ – న్యాయం; మైనార్టీ సంక్షేమం
  12. ఆనం రామనారాయణ రెడ్డి – దేవాదాయ
  13. పయ్యావుల కేశవ్ – ఆర్ధిక, ప్రణాళిక; వాణిజ్య పన్నులు; శాసనసభా వ్యవహారాలు
  14. అనగాని సత్య ప్రసాద్  – రెవిన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్స్
  15. కొలుసు పార్ధసారథి – గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాలు
  16. డోలా బాల వీరాంజనేయ స్వామి- సాంఘిక సంక్షేమం, సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్
  17. గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్
  18. కందుల దుర్గేశ్ – పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
  19. గుమ్మడి  సంధ్యారాణి – మహిళా, శిశు సంక్షేమం; గిరిజన సంక్షేమం
  20. బిసి జనార్ధన్ రెడ్డి – రోడ్లు, భవనాలు; మౌలిక వసతులు, పెట్టుబడులు
  21. టిజి భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం; ఫుడ్ ప్రాసెసింగ్
  22. ఎస్. సవిత – బిసి సంక్షేకం; చేనేత-జౌళి; ఆర్ధికంగా వెనుకబడిన వారి సంక్షేమం
  23. వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
  24. కొండపల్లి శ్రీనివాస్ – మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాలు
  25. మునిపల్లి రాంప్రసాద్ రెడ్డి – రవాణా, క్రీడలు-యువజన సర్వీసులు
RELATED ARTICLES

Most Popular

న్యూస్