తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి మహారాష్ట్రలో పర్యటించి ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తొలుత కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం షిర్డీ చేరుకొని శ్రీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆయా దేవాలయాల అర్చకులు బాబుకు ఆశీర్వచనం అందించగా, ఆలయ ట్రస్టీలు బాబు దంపతులను సత్కరించి ప్రసాదాలు, మెమెంటోలు అందజేశారు.
మొన్న 13న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ మరునాడు వారణాసి వెళ్ళిన చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న 15న మంగళగిరి పార్టీ కార్యాలయంలో పలువురు నేతలు, విదేశాల నుంచి ఓటు వేయడం కోసమే వచ్చిన ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ ఉదయం సతీ సమేతంగా మహారాష్ట్రలో రెండు ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. తన స్వగ్రామం నారా కోడూరు గ్రామ దేవత, తిరుమల శ్రీవారి దర్శనం మినహా ఇతర దేవాలయాల సందర్శన, హోమాలు, పూజల పట్ల పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు గత సంవత్సరం కాలంగా వివిధ హోమాలు, పూజలు తన నివాసంలో నిర్వహించడం గమనార్హం.