Tuesday, September 17, 2024
HomeTrending NewsBabu: రాష్ట్రాన్ని గాడిలో పెడతా- కలిసి రండి :బాబు

Babu: రాష్ట్రాన్ని గాడిలో పెడతా- కలిసి రండి :బాబు

నాలుగేళ్ళ జగన్ పాలనలో  తోటపల్లి ప్రాజెక్టుకు కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ ఐదేళ్ళ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 1650కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని, ఈ ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని విమర్శించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు తీసుకు రావాలని తాము సంకల్పించామని తెలిపారు. రాబోయే కాలంలో వంశధార-నాగావళి ప్రాజెక్టులు అనుసంధానం చేసి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులపై యుద్ధభేరీ కార్యక్రమంలో భాగంగా నేడు తోటపల్లి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు.

ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరగాలని, వారి కళ్ళలో ఆనందం చూడాలనేది టిడిపి సిద్ధంతమని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక న్యాయం చేస్తామని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  వంశధారకు తామే రూపకల్పన చేశామని, నాడు వైఎస్సార్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే  పరిహారం ఇస్తే తాను రూ. 5 లక్షలకు దాన్ని పెంచానని అన్నారు.  సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, వాటిని వినియోగించుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమని బాబు స్పష్టం చేశారు.

ఈ ముఖ్యమంత్రి యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని, ఆయన ఇచ్చింది ఒకే ఒక వాలంటీర్ ఉద్యోగమని, ఐదు వేల రూపాయలు ఇచ్చి వారిచేత తప్పులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే పెట్టుబడులు వాటంతట అవే పరిగేత్తుకుంటూ వస్తాయన్నారు. యువ గళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని, ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని, శక్తివంతమైన తెలుగుజాతిని నిర్మాణం చేయడానికి కలిసి రావాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్