Saturday, January 18, 2025
HomeTrending NewsBotcha: ఇన్నాళ్ళూ తప్పించుకున్నారు: బాబుపై బొత్స

Botcha: ఇన్నాళ్ళూ తప్పించుకున్నారు: బాబుపై బొత్స

ప్రజా జీవితంలో ఉన్న వారు, పాలన చేసే వాళ్లు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడా అవినీతికి పాల్పడకూడదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో ఆయన వాటన్నింటినీ అతిక్రమించారని, ఎప్పుడూ దొరకలేదని, ఇప్పుడు దొరికి దొంగ అయ్యారు. దీంతో ఆయన బేలగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారని. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు. అలాగే, స్కిల్‌ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఒక్క విషయం అడుగుతున్నాం. మీరు ఆరోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో.. దాని గురించి ఎందుకు ఎవరు “మాట్లాడడం లేదు? మన ప్రభుత్వం వాటా రూ. 371 కోట్లు ఇచ్చారు. కానీ సీమెన్స్‌ కంపెనీ తన వాటాగా ఇవ్వాల్సిన దాదాపు రూ. 3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మరి అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసింది? దీనిపై చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ అస్సలు ఎందుకు మాట్లాడడం లేదు?” అంటూ నిలదీశారు.

స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన  అధికారుల జోలికి వెళ్ళకుండా కేవలం చంద్రబాబునే అరెస్టు చేశారంటూ వస్తోన్న విమర్శలను బొత్స తిప్పి కొట్టారు.  ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉంటే.. వారు బాధ్యులై ఉంటే, చర్యలు ఉంటాయని, తమకు  మాకు ఎవరిపైనా ప్రేమ, ద్వేషం లేదని, ఎవరైనా తప్పు చేస్తే, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రేమచంద్రారెడ్డి తప్పు ఏదైనా ఉంటే చూపాలన్నారు. ఒప్పందంలో స్పష్టత లేదు కాబట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేయొద్దని అప్పటి అధికారులు కోరీనా అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ. 371 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. ” దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. బ్లూబుక్‌ ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తి (స్వయంగా సీఎం) నేరుగా ఆదేశిస్తే.. అధికారులు అమలు చేయక తప్పదు కదా?” అని బొత్స అన్నారు.  స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్‌ సీఎం దగ్గరకు వెళ్తుంది కాబట్టి దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుందన్నారు.

బాబు అరెస్ట్ పై తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. “కారణం చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన అనుకుంటే, ఆ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడాలి” అని సూచ్న్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్