Saturday, January 18, 2025
HomeTrending Newsఅయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  విషయం తెలిసిన వెంటనే ఆయన అయ్యన్న భార్య పద్మావతికి ఫోన్ చేసి మాట్లాడారు.పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బాబు పిలుపు ఇచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని నేతలను ఆదేశించారు.

ఈ సందర్భంగా బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ… “రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సిఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని అరెస్టు చెయ్యడం దిగ్ర్బాంతి కలిగించింది. అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోంది…ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదు.  దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై ప్రశ్నిస్తున్న బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అరెస్టులు” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్