Thursday, May 8, 2025
HomeTrending NewsBabu: అనంత ఘటనపై బాబు ఆగ్రహం

Babu: అనంత ఘటనపై బాబు ఆగ్రహం

అనంతపురం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్‌లో వైకాపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ వీరంగం సృష్టించడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఏపీలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దాడిలో వైకాపా కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేరస్థుడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…  అనంతపురం నగరంలోని అంబేద్కర్ నగర్ లో గుజ్జల సురేష్ అనే వ్యక్తి మద్యం అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని,  స్టేషన్ కి తీసుకెళ్లారు.  అతనికి మద్దతుగా 32 వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్ర, పదిమంది అనుచరులతో కలిసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.  అక్కడ ఎస్సై సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించగా మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ అని, తాము ఎక్కడైనా కూర్చుంటామంటూ కార్పొరేటర్ వాగ్వాదానికి దిగాడు.  ఇంతలో ఎస్ఐ మునిస్వామి అక్కడికి చేరుకోగా ఆయనతో కూడా దురుసుగా ప్రవర్తించాడు.   ఎస్సై మునిస్వామి, కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.  తాము ఎమ్మెల్యే అనుచరులము మమ్మల్ని ఎదిరిస్తారా అంటూ పోలీసులపై దూషణకు దిగారు. సురేష్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదంటూ హంగామా సృష్టించారు.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్