Saturday, January 18, 2025
HomeTrending NewsGaddar: పాటతో ప్రజలను కదిలించిన గద్దర్: బాబు

Gaddar: పాటతో ప్రజలను కదిలించిన గద్దర్: బాబు

గద్దర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన పాట ప్రజలను కదిలించిందన్నారు. పోరాహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.

“ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో… పౌరహక్కుల పోరాటాల్లో…ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను… అంటూ  పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్