Friday, November 22, 2024
HomeTrending Newsఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బాబు ప్రశ్న

ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బాబు ప్రశ్న

Chandrababu Demand Sec To Conduct Municipal Elections In Fair Manner :

మున్సిపల్  ఎన్నికల్లో  వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి కొంతమంది అధికారులు కూడా సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని  మండిపడ్డారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలిపెట్టబోమని అయన హెచ్చరించారు. సోమవారం జూమ్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నెల్లూరులో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి 3 గంటలు దాటినా ఇంతవరకు అభ్యర్ధుల తుది జాబితా  ప్రకటించలేదని, కానీ మరో వైపు 8 వార్దులు ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారని, మీ ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం మీకెవరిచ్చారని అయన ప్రశ్నించారు.

“ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నారు?  మీ ఇష్ట ప్రకారం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? అధికారులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎన్నికల సంఘానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న చిత్తశుద్ది ఉంటే నెల్లూరులో ఎన్నికల్ని రద్దు చేయాలి. అక్కడ దినేష్ కుమార్ అనే అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

“ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలుగుదేశం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ ఒక్కరిని వదలిపెట్టం. తప్పుడు పనులు చేసే వారిని ప్రజల్లో దోషులుగా నిలబెలబడతాం. ‎ వైసీపీ  అరాచకాలపై ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మన కుటుంబాల్ని కాపాడుకోగలం.  లేకపోతే మన కుటుంబాలు సఫర్  అవుతాయి, రాష్ట్రం ఇబ్బందుల్లో  పడుతుంది. మౌనంగా ఉంటే అరాచక శక్తులు ఇంకా  రెచ్చిపోతారు.  ప్రజలు దీనిపై ఆలోచించాలి. నెల్లూరులో అరాచకాలపై ఈసీకి లేఖ రాశాం. దీనిపై ఈసీ వెంటనే స్పందించాలి…ఈ ఎన్నికలు రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ‎ వైసీపీ నేతల అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం’ అని అయన వెల్లడించారు.

Also Read :

ఇది పధ్ధతి కాదు: బాబు హెచ్చరిక

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్