Thursday, March 28, 2024
HomeTrending Newsఇది పధ్ధతి కాదు: బాబు హెచ్చరిక

ఇది పధ్ధతి కాదు: బాబు హెచ్చరిక

దీపావళి రోజున కూడా నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ పెట్టడం దుర్మార్గమని  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. క్రిస్మస్ రోజున కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నించారు.  నామినేషన్ వెయ్యకుండా టిడిపి నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇబ్బంది పెడుతున్నారని, నామినేషన్లు వేయవద్దని తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఇది గర్హనీయమని పేర్కొన్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంతి  చెప్పినట్లే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఫలానా తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం కేబినేట్ లో చెప్పారని, ఆ ప్రకారమే షెడ్యూల్ వచ్చిందని బాబు ఆక్షేపించారు.

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇష్టారాజ్యంగా నిర్వహించారని, ఇలాంటి అక్రమాలు తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.  గతంలో పుంగనూరు మున్సిపాలిటీలో అధికారిగా పనిచేసిన లోకేశ్వర్ అనే అధికారిని ఇప్పుడు కుప్పం స్పెషలాఫీసర్ గా పంపారని, ఇతను మంత్రి పెద్దిరెడ్డికి చెంచా లాగా పనిచేస్తున్నారని, ఇప్పుడు కుప్పంలో మున్సిపల్ ఎన్నికలను ఏకపక్షంగా జరిపించడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టాడని, ఇలాంటి అధికారిని వదిలి పెట్టె ప్రసక్తే లేదని బాబు హెచ్చరించారు.  సిఎం జగన్ చెప్పనట్లు చేసి, అక్రమాలకూ పాల్పడితే పని అవ్వొచ్చు కానీ మీ అంతం అక్కడే మొదలవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. నామినేషన్ల విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్లు పద్దతిగా  వ్యవహరించాలని, డ్రామాలాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గతంలో నామినేషన్లలో ఏవైనా లోపాలు, పొరపాటు ఉంటే అధికారులు సరిదిద్దేవారని, తగిన సహకారం అందించేవారని, అలాంటిది ఇప్పుడు అధికారులు తిరస్కరిస్తున్నారని బాబు విస్మయం వ్యక్తం చేశారు. టిడిపి అభ్యర్ధులు తగిన జాగ్రత్తలు తీసుకొని నామినేషన్లు దాఖలు చేయాలని బాబు సూచించారు, దీనికి గాను 16 మౌలిక అంశాలను  పరిగణన లోకి తీసుకోవాలని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్